భారతీయ అమెరికన్ కమ్యూనిటీ కోసం

జో బిడెన్ ఆజెండా

 

ఒక సెనేటర్‌గా, సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్‌గా, మరియు వైస్ ప్రెసిడెంట్‌గా, జో బిడెన్ భారతీయ అమెరికన్లకు మరియు భారత అమెరికా దేశాల మధ్య బలమైన స్నేహానికి తమ మద్దతును అందించారు. వైవిధ్యమైన మరియు శక్తివంతమైన భారతీయ అమెరికన్ల సంఘాలు అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని ప్రతి రాష్ట్రాన్ని సుసంపన్నం చేసాయి. ఒక అధ్యక్షుడిగా, బిడెన్ ఈ సంఘాలతో కలిసి పని చేస్తారు; అమెరికా యొక్క విజయం, శ్రేయస్సు మరియు భద్రతలో వారి అసాధారణ సహకారాన్ని ఆయన సగర్వంగా స్వాగతిస్తున్నారు; భారతీయ అమెరికన్ల అవసరాలను తెలుసుకుంటున్నారు; వారి ప్రాధాన్యతలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధానాలను అమలులో పెడతారు. భారతీయ అమెరికన్లు, మిగిలిన అందరు అమెరికన్ల మాదిరిగానే - విద్య, అధిక-నాణ్యత గల మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ, వాతావరణ సంబంధిత సంక్షోభాలను ఎదుర్కొనడం మరియు మన విలువలకు సరితూగేలా మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించడం మరియు ఆధునీకరించడం వంటి మన భవిష్యత్ కు సంబంధించిన ముఖ్య అంశాలలో తమ వంతు సహకారం అందించారు. దక్షిణాసియా నుండి అమెరికా వచ్చిన వారికి  తన పాలనవ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించేలా బిడెన్ పాటుపడతారు, అతని వైస్ ప్రెసిడెంట్ నామినీ అయిన సెనేటర్ కమలా హారిస్, ఆమె తల్లి ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో చదువుకుని తమ జీవితాన్ని మలచుకోవాలని  భారతదేశం నుండి  వచ్చారు. మా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ లో గల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే భారతీయ అమెరికన్లు తమ వర్గాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందించడంలో తమ గళాలను అందించేలా ఏర్పాటుచేయడం జరుగుతుంది.

COVID-19 తో పోరాడటం మొదలుకొని, మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించానికి మన ఆర్థిక వ్యవస్థను తిరిగి మెరుగుపరచడం వరకు, బిడెన్-హారిస్ అడ్మినిస్ట్రేషన్ భారతీయ అమెరికన్లు విశ్వసించదగినది.

 

ద్వేషం మరియు మూర్ఖత్వపు పెరుగుతున్న ఆటుపోట్లను నివారిస్తారు

FBI యొక్క ద్వేషపూరిత నేర గణాంకాలు ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి, దేశవ్యాప్తంగా  ద్వేషపూరిత నేరాల సంఖ్య బాగా పెరిగింది. స్పష్టమైన భాషలో సరిగ్గా చెప్పాలంటే మన ప్రెసిడెంట్ పక్షపాతం మరియు ద్వేషాన్ని ప్రోత్సహించే వ్యక్తి - అది చాలా ప్రమాదకరమైన విషయం.

హిందూ, సిక్కు, ముస్లిం, జైన మరియు ఇతర మతస్థులు - ఇలా అన్ని నేపథ్యాలలో భారతీయ అమెరికన్లు - ఎన్నో బెదిరింపులు మరియు జెనోఫోబిక్ దాడులకు గురవుతున్నారు, వాషింగ్టన్ లోని మన నేతలకు, గతంలో కంటే ఇప్పుడు, తమ వెనుక ఒక దన్ను కలదనే భరోసా అవసరపడింది.

 

ఒబామా-బిడెన్ పరిపాలనలో, ఎఫ్బిఐ సిక్కులు, హిందువులు మరియు బౌద్ధులతో కూడిన ఒక ద్వేషపూరిత నేర గణాంకాల కార్యక్రమాన్నివిస్తరించింది. ఒక అధ్యక్షుడిగా, బిడెన్ ద్వేషపూరిత దాడుల పెరుగుదలను నేరుగా పరిష్కరించడమే కాకుండా ద్వేషపూరిత నేరానికి పాల్పడిన వ్యక్తి తుపాకీని కొనడం లేదా కలిగి ఉండకుండా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకు వస్తారు. బిడెన్ ద్వేషపూరిత నేరాల విచారణకు ప్రాధాన్యతనిచ్చే న్యాయ శాఖలో నాయకులను నియమిస్తారు మరియు మత ఆధారిత ద్వేషపూరిత నేరాలతో సహా - ద్వేషపూరిత నేరాలను ఎదుర్కోవటానికి మరియు తెల్ల జాతీయవాద ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి అదనపు వనరులను కేటాయించేలా ఆయన తన న్యాయ శాఖను ఆదేశిస్తారు. ప్రార్థనా గృహాలు మరియు గురుద్వారాలు, మందిరాలు, దేవాలయాలు మరియు మసీదుల వంటి ఇతర మత సంఘ ప్రదేశాలలో జరిగే కొన్ని ద్వేషపూరిత నేరాలకు పడే శిక్షను పెంచే ఒక చట్టాన్ని కూడా ఆయన తేవాలని అనుకుంటున్నారు. ఆయన తన కార్యనిర్వాహక అధికారాన్ని ఉపయోగించుకుని ప్రార్థనా గృహాలపై హింసాత్మక చర్యలను నివారించడానికి న్యాయ శాఖ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చేస్తారు.

 

 

ఆరాధన గృహాల భద్రతా అవసరాలను నెరవేరుస్తారు 

2012 లో, విస్కాన్సిన్, గురుద్వారాలోని ఓక్ క్రీక్ లో ఒక తెల్ల ఆధిపత్యవాది జరిపిన కాల్పులలో సిక్కు సమాజం ఘోర విషాదాన్ని ఎదుర్కొంది, ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందారు మరియు నలుగురు గాయపడ్డారు. జనవరి 2019 లో, ఒక హిందూ మందిరం విధ్వంసానికి గురయ్యింది, ఆ వినాశకర విధ్వంసంలో మందిరం యొక్క కిటికీ అద్దాలు పగిలిపోయాయి మరియు గోడలనిండా జెనోఫోబిక్ సందేశాలు స్ప్రే-పెయింట్ చేయబడ్డాయి. మందిరంలోని మూర్తి ముఖము యొక్క రూపురేఖలు మారిపోయాయి మరియు కత్తితో పీఠాన్ని చిధ్రం చేయడం జరిగింది. మందిరాలు, మసీదులు, గురుద్వారాలు మరియు దేవాలయాలు పవిత్రమైన ప్రదేశాలు అని బిడెన్ అర్థం చేసుకున్నారు, విధ్వంసం మరియు విధ్వంసపూరిత చర్యలు కమ్యూనిటీలో ఒకరితో ఒకరికి గల సంబంధాన్నిమరియు స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఆరాధించే కమ్యూనిటీ యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అమెరికా మత స్వేచ్ఛ పునాదిపై నిర్మించబడింది. ఒక అధ్యక్షుడిగా, బిడెన్ ద్వేషపూరిత హింస మరియు బెదిరింపు చర్యలను అంతం చేయడానికి మరియు మన అత్యున్నత విలువలను చేరుకోవడంలో మనకు సహాయపడే ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు. సమాఖ్య ప్రభుత్వం నుండి ప్రార్థనా స్థలాలకు బలమైన మరియు ప్రత్యక్ష భద్రత సంబంధిత మద్దతు లభించేలా చూస్తారు. మనము మన విశ్వాస-ఆధారిత సంస్థలను వాటిపై జరిగే ఘోరమైన దాడుల నుండి రక్షణ కల్పించడానికి కేవలం విరాళాలు మరియు అంతర్గత నిధుల సేకరణ ప్రయత్నాలపైనే ఆధారపడి వదిలేయలేము. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) యొక్క లాభాపేక్షలేని సెక్యూరిటీ గ్రాంట్ ప్రోగ్రామ్ (ఎన్ఎస్జిపి) ద్వారా విశ్వాస-ఆధారిత సంస్థలకు జారీచేసే ప్రత్యక్ష భద్రత మంజూరు నిధులలో తక్షణ మరియు గణనీయమైన పెరుగుదలను సాధించడానికి బిడెన్ కాంగ్రెస్ తో కలిసి పని చేస్తారు.

 

 

అమెరికన్లందరికీ అమెరికా కలను పునరుద్ధరిస్తారు

అమెరికా యొక్క వెన్నెముక అయిన మధ్యతరగతిని పునర్నిర్మించడానికి బిడెన్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈసారి అందరూ కలిసి కదిలేలా చూస్తారు. మధ్యతరగతి అంటే కేవలం మనుషుల సంఖ్య మాత్రమే కాదని ఆయనకి తెలుసు – ఇది తనకంటూ ఒక ఇంటిని సొంతం చేసుకోవడం, పిల్లలను కళాశాలకు పంపడం, డబ్బులు పొదుపుచేసుకోవడం మరియు ముందుకు సాగడం అనే విలువలతో కూడిన ఒక కూటమి: ఆయన కార్మికులందరూ ఒకేలా గౌరవం పొందేలా మరియు వారు అర్హమైన వేతనం, ప్రయోజనాలు మరియు కార్యాలయపరమైన రక్షణలను అందుకునేలా చూస్తారు. బిడెన్ ఒక బలమైన మధ్యతరగతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. చాలామంది భారతీయ అమెరికన్లు చిన్న వ్యాపార యజమానులు, వ్యవస్థాపకులు మరియు ఆవిష్కర్తలు. బిడెన్ ఒక చిన్న వ్యాపార అవకాశ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ-ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తారు, ఇది విజయవంతమైన రాష్ట్ర మరియు స్థానిక పెట్టుబడి కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తుంది, అలాగే అత్యంత ప్రభావవంతమైన న్యూ మార్కెట్స్ టాక్స్ క్రెడిట్‌ను శాశ్వతం చేస్తారు, ఖర్చు లేని వ్యాపార ఇంక్యుబేటర్లు మరియు ఇన్నోవేషన్ హబ్‌ల జాతీయ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ వడ్డీకి వ్యాపార రుణాల ప్రాప్యతను విస్తరిస్తారు మరియు సాంకేతిక సహాయం మరియు సలహా సంబంధిత సేవలకు గల  అడ్డంకులను తొలగిస్తారు.

 

 

వలసదారుల దేశంగా మన విలువలను భద్రపరుస్తారు

ఎక్కువగా వలస వచ్చిన ఒక సమాజంగా, అమెరికన్ మూలాలకు సంబంధించిన తరాలుగా తిరిగి రావడం వంటి కొన్ని సందర్భాల్లో వలసదారులుగా తాము అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకువచ్చే బలం మరియు స్థితిస్థాపకత గురించి భారతీయ అమెరికన్లకు ప్రత్యక్షంగా తెలుసు. కానీ ఒక అధ్యక్షుడుగా ట్రంప్ వలసదారుల దేశంగా మన విలువలు మరియు మన చరిత్రపై నిరంతరంగా దాడి చేస్తూ వస్తున్నారు. ఇది తప్పు, బిడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అది కొనసాగదు. బిడెన్ తాను అధ్యక్షుడయిన మొట్టమొదటి రోజే ట్రంప్ యొక్క ఈ "ముస్లిం నిషేధం" ను ఉపసంహరించుకుంటారు. మన సరిహద్దులో గందరగోళానికి మరియు మానవతా సంక్షోభానికి కారణమయ్యే హానికరమైన అసైలం విధానాలను తిప్పికొడతారు. మన వ్యవస్థను ఆధునీకరించే శాసనపరమైన ఇమ్మిగ్రేషన్ సంస్కరణను ఆమోదించడానికి ఆయన వెంటనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడం ప్రారంభిస్తారు, ఇప్పటివరకు నమోదుకాని దాదాపు 11 మిలియన్ల మంది వలసదారులకు - అందులో భారతదేశం నుండి 500,000 మందికి పైగా ఉన్నవారి - పౌరసత్వానికి రోడ్‌మ్యాప్ అందించడం ద్వారా కుటుంబాలను కలిపి ఆయన ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.

బిడెన్ కుటుంబ-ఆధారిత ఇమ్మిగ్రేషన్‌కు మద్దతు ఇస్తారు. మన ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ యొక్క ప్రధాన సూత్రంగా కుటుంబ ఏకీకరణను సంరక్షిస్తారు, ఇందులో భాగంగా కుటుంబ వీసా బ్యాక్‌లాగ్‌ను తగ్గించడం ఉంటుంది. ఆయన స్థూల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా శాశ్వత, పని-ఆధారిత ఇమ్మిగ్రేషన్ కోసం అందించబడే వీసాల సంఖ్యను పెంచుతారు మరియు STEM రంగాలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ఇటీవల గ్రాడ్యుయేట్లకు గల ఆటంకాలనుండి వారికి మినహాయింపు కల్పిస్తారు. ఆయన మొదటగా  వేతనాలు మరియు కార్మికుల రక్షణ కొరకు అధిక-నైపుణ్యం గల, ప్రత్యేక ఉద్యోగాల కోసం తాత్కాలిక వీసా వ్యవస్థను సంస్కరించడానికి మద్దతునందిస్తారు, తరువాత అందించబడే వీసాల సంఖ్యను విస్తరించడం మరియు దేశం ద్వారా ఇవ్వబడే  ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై పరిమితులను తొలగించడం చేస్తారు, ఇది చాలా కాలం నుండి వేచి ఉన్న చాలా మంది భారతీయుల కుటుంబాలకు ఊరట కల్పిస్తుంది.

గ్రీన్ కార్డ్ హోల్డర్ల కోసం సహజీకరణ ప్రక్రియను బిడెన్ పునరుద్ధరించి కాపాడతారు. వార్షిక గ్లోబల్ శరణార్థుల ప్రవేశ లక్ష్యాన్ని 125,000 కు నిర్ణయించడం ద్వారా మన బాధ్యత, మన విలువలు మరియు ఇంతకుముందెన్నడూ లేని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఈ దేశంలోకి మనము స్వాగతించే శరణార్థుల సంఖ్యను కాలక్రమేణా ఆయన పెంచడానికి ప్రయత్నిస్తారు. ఆయన శరణార్థుల కనీస ప్రవేశ సంఖ్య ఏటా 95,000 గా ఉండేలా చేయడానికి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తారు. DACA ప్రోగ్రామ్‌ను పున: స్థాపించడం ద్వారా బిడెన్ కలలు కనేవారి అనిశ్చితిని తొలగిస్తారు మరియు వారి కుటుంబాలను అమానవీయ విభజన నుండి రక్షించడానికి చట్టపరమైన అన్ని వికల్పాలను అన్వేషిస్తారు.  ఆయన కార్యస్ధల సంబంధిత దాడులను అంతం చేస్తారు మరియు ఇతర సున్నితమైన ప్రదేశాలను ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల నుండి రక్షిస్తారు. ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యకు భయపడి వైద్య సహాయం తీసుకోవటానికి, లేదా పాఠశాలకు, ఉద్యోగానికి లేదా ప్రార్థనా స్థలానికి వెళ్లడానికి ఎవరూ భయపడకూడదు.

 

 

రెలిజియస్ వర్కర్ వీసాల కోసం స్ట్రీమ్‌లైన్ ప్రాసెసింగ్

చాలా మంది భారతీయ అమెరికన్లు మత సంఘాలకు చెందినవారు, వారు పండితులు మరియు మత నిపుణుల సలహాలు, మద్దతు మరియు జ్ఞానం మీద ఆధారపడి ఉంటారు, వారు తాత్కాలిక మత కార్యకర్త (R-1) వీసాపై యునైటెడ్ స్టేట్స్ కు ప్రయాణించు విదేశీ పౌరులు కావచ్చు. అనేకమైన భారతీయ అమెరికన్ సంస్థలకు, మత కార్మికుల వీసాల సమర్పణ మరియు సమీక్ష ప్రక్రియకు గణనీయమైన పరిపాలనవ్యవస్థ మరియు ఆర్థిక వనరులు అవసరపడతాయి. అంతేకాకుండా, ప్రాసెసింగ్ సమయాలు ప్రయాణ ఆలస్యాలుగా పరిణమించవచ్చు, ఇది దేశవ్యాప్తంగా ఈ సంఘాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మత విశ్వాస-ఆధారిత సంస్థలు సమర్పించిన మతపరమైన వర్కర్ వీసాల సమీక్షను క్రమబద్ధీకరించు పద్ధతులు మరియు కార్యక్రమాలను గుర్తించడానికి బిడెన్ స్టేట్ డిపార్ట్మెంట్ మరియు యు.ఎస్. సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) కు దిశానిర్దేశం చేస్తారు.

 

 

భారతీయ అమెరికన్ సంఘానికి గల భాషాపరమైన అడ్డంకులను తొలగిస్తారు

కీలకమైన సేవలు మరియు వనరులకు సంబంధించిన భాషాపరమైన అవరోధాలు అనేవి పరిమిత ఆంగ్ల నైపుణ్యం కలిగిన భారతీయ అమెరికన్లు తమ సామర్థ్యాన్ని మరియు అమెరికా కలను సాకారం చేసుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు. పరిమిత ఆంగ్ల నైపుణ్యం గల వ్యక్తులు ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర ప్రభుత్వ సేవలకు ప్రాప్యత కలిగి ఉండే విధంగా మరియు భారతీయ అమెరికన్ వ్యక్తులు మరియు కుటుంబాలకు సమాఖ్య కార్యక్రమాల ప్రాప్యతను పెంచే మార్గాలను గుర్తించడానికి బిడెన్ పని చేస్తారు. కొత్త వలసదారులకు ఉద్యోగాలు కనుగొనడంలో సహాయపడటానికి ఆయన పొరుగు వనరుల కేంద్రాలను లేదా స్వాగత కేంద్రాలను కూడా సృష్టిస్తారు; ప్రాప్యత సేవలు మరియు ఆంగ్ల భాషా అభ్యాస అవకాశాలు; మరియు పాఠశాల వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు రోజువారీ జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలను ఆయన నావిగేట్ చేస్తారు.  పిల్లలందరూ వారివారి సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వ పాఠశాల లన్నింటిలో ప్రవేశించడంలో సహాయపడేలా వారికి తగినంత ఆంగ్ల భాషా అభ్యాస మద్దతు అందేలా నిర్ధారించడానికి ఆయన పని చేస్తారు.

 

భారతీయ అమెరికన్ల వైవిధ్యం మరియు సహకారాన్ని గౌరవిస్తారు

వైవిధ్యమే అమెరికాకు గల ఒక ముఖ్యమైన శక్తి అని ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ గౌరవించింది, ఇందులో భాగంగా భారతీయ అమెరికన్ల సైనిక సేవను గౌరవించటానికి మొట్టమొదటిసారిగా వైట్ హౌస్ ఈవెంట్ ను మరియు వైట్ హౌస్, నావల్ అబ్జర్వేటరీలో, ఉపరాష్ట్రపతి నివాసం వద్ద మరియు పెంటగాన్ లో దీపావళి వేడుకలను నిర్వహించడం జరిగింది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికన్ విశ్వాస మరియు వారసత్వ సంఘాల యొక్క ముఖ్యమైన సాంస్కృతిక వేడుకలను మరోసారి గుర్తించి గౌరవిస్తుంది. ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ యు.ఎస్. ఆర్మీ విధానాన్ని మార్చడం  ద్వారా చరిత్రను సృష్టించింది, ఇది సిక్కులను, అలాగే ముస్లిం మహిళలను యూనిఫాంలో ఉన్నప్పుడు శిరస్సుపై ధరించే మతపరమైన వస్త్రాలను ధరించడానికి అనుమతించింది, తద్వారా మన సాహసికులైన సైనికులు తమ విశ్వాసాన్ని గౌరవించి తమ దేశానికి సేవ నందించగలరు. మన సాయుధ సేవలన్నింటిలో సహేతుకమైన మతపరమైన వసతులు ఉండేలా నిర్ధారించడానికి బిడెన్ ప్రయత్నిస్తారు. ఆయన భారతీయ అమెరికన్ సమాజంతో కలిసి అమెరికా వలె కనిపించే సమాఖ్య అధికారులు మరియు న్యాయమూర్తులను నామినేట్ చేసి నియమిస్తారు. విధానాల ద్వారా ప్రభావితమైన వారి సంఘాలు నిర్ణయాత్మక ప్రక్రియలో ముఖ్యమైన భాగం అని నిర్ధారించడానికి బిడెన్ కీలకమైన వాటాదారులను రంగంలోనికి దించుతారు.

 

 

పిల్లలందరికీ పాఠశాలలో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తారు

ప్రతి పిల్లవాడు వారి వారి జిప్ కోడ్, లింగము, లైంగిక ధోరణి, చర్మ రంగు, మతం, వారికి వైకల్యం ఉందా లేదా  తల్లిదండ్రుల ఆదాయం ఎంత అనే దానితో సంబంధం లేకుండా మంచి విద్యను పొందాలి.  విద్యావేత్తలకు మద్దతు, గౌరవం మరియు వారి అవసరాలు మరియు అర్హతల బట్టి వేతనం నిర్ధారించి వారు విద్యార్థులు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యకరమైన పెద్దలుగా ఎదగడానికి దోహదపడేలా బిడెన్ చూస్తారు. బెదిరింపు మరియు వేధింపు వ్యతిరేక విధానాలను అభివృద్ధి చేయడానికి పాఠశాల జిల్లాలకు అవసరమయ్యే సేఫ్ స్కూల్స్ ఇంప్రూవ్‌మెంట్ యాక్ట్  ఆమోదించడానికి ఆయన మద్దతు ఇస్తారు మరియు మన పాఠశాలల్లో పనిచేసే మనస్తత్వవేత్తలు, సలహాదారులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య నిపుణుల సంఖ్యను రెట్టింపు చేస్తారు. తద్వారా పిల్లలు వారికి అవసరమైన మానసిక ఆరోగ్య సంరక్షణ పొందగలుగుతారు.

బెదిరింపు వ్యతిరేక కార్యక్రమాల కోసం, ప్రత్యేకించి మతపరమైన యువత చేసే బెదిరింపులను వ్యతిరేకించే కార్యక్రమాలతో పాటు,  బిడెన్ అడ్మినిస్ట్రేషన్ న్యాయ శాఖ మరియు విద్యా శాఖకు అదనపు నిధులను కేటాయిస్తుంది. ఆయన సంఘ సంస్థలతో కలిసి ఒబామా-బిడెన్ వైట్ హౌస్ AAPI బెదిరింపు నివారణ టాస్క్‌ఫోర్స్‌ను స్థాపించనున్నారు. 

బిడెన్ అధ్యాపకుల మార్గదర్శకత్వం, నాయకత్వం మరియు అదనపు విద్యలో కూడా పెట్టుబడులు పెడతారు, తద్వారా అధ్యాపకులు తరువాతి తరం అమెరికన్లను రూపొందించడంలో తమ శక్తిని కేంద్రీకరించవచ్చు. ఆయన అధిక మరియు తక్కువ-ఆదాయ పాఠశాల జిల్లాల మధ్య నిధుల అంతరాన్ని తొలగించడానికి టైటిల్ I నిధులను మూడింతలు చేస్తారు, ప్రభుత్వ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో 125,000 డాలర్ల కంటే తక్కువ కుటుంబ ఆదాయం గల విద్యార్థులందరికీ ట్యూషన్ ఫీజులు లేనివిధంగా చేయడానికి, అలాగే ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ కళాశాల లేదా ఇతర ఋణ రహిత  అధిక-నాణ్యత శిక్షణలో రెండేళ్ళకు ప్రవేశం కల్పించేలా చేసి, విద్యార్థుల విజయాన్ని మెరుగుపరచడానికి మరియు మరింత సంపన్నమైన మధ్యతరగతి వృద్ధి చెందడానికి కృషి చేస్తారు.

 

 

యు.ఎస్-ఇండియా భాగస్వామ్యానికి మద్దతు ఇస్తారు

సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్‌గా మరియు వైస్ ప్రెసిడెంట్ గా బిడెన్ మన వ్యూహాత్మక నిర్వహణ, ప్రజలతో ప్రజల సంబంధాలు మరియు ప్రపంచ సవాళ్లపై భారత్‌తో సహకారాన్ని క్రమపద్ధతిలో పెంచడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006 లో, యు.ఎస్-ఇండియా సంబంధాల భవిష్యత్తుపై బిడెన్ తన దృష్టిని ఇలా ప్రకటించారు: "2020 లో, ప్రపంచంలోనే రెండు అతి సన్నిహిత దేశాలు భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ అవుతాయని నా కల.".  ఆ దృష్టిని సాకారం చేయడానికి ఆయన 2008 లో యు.ఎస్-ఇండియా సివిల్ న్యూక్లియర్ ఒప్పందాన్ని ఆమోదించడంలో కాంగ్రెస్‌ కు నేతృత్వం వహించి, డెమొక్రాట్లు మరియు రిపబ్లికన్లతో కలిసి పనిచేయడం కూడా జరిగింది.

ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యూహాత్మక, రక్షణ, ఆర్థిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సవాళ్ళపై భారత, అమెరికాల మధ్య సహకారాన్ని మరింతగా పెంచింది. యు.ఎస్-ఇండియా భాగస్వామ్యాన్ని పెంచడంలో మరియు విస్తరించడంలో బిడెన్ ఒక ప్రధాన ఛాంపియన్ గా వ్యవహరించారు. ప్రపంచ వేదికపై ఎదుగుతున్న భారతదేశం యొక్క  పాత్రను గుర్తించిన ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరించబడిన మరియు విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి యుఎస్ మద్దతును అధికారికంగా ప్రకటించింది. ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి "మేజర్ డిఫెన్స్ పార్టనర్" అని పేరు పెట్టింది - ఇది కాంగ్రెస్ ఆమోదించిన హోదా - ఇక భారతదేశానికి తన మిలిటరీని బలోపేతం చేయడానికి కావలసిన ఆధునిక మరియు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే, భారతదేశం మన అతి సన్నిహిత భాగస్వాములతో సమానంగా పరిగణించబడుతుంది.

 

ప్రెసిడెంట్ ఒబామా మరియు వైస్ ప్రెసిడెంట్ బిడెన్ కూడా మన దేశాలలో మరియు ఈ ప్రాంతమంతటా  వ్యాపించిన ఉగ్రవాదంపై పోరాడటానికి భారతదేశంతో మన సహకారాన్ని బలపరిచారు. దక్షిణ ఆసియా సరిహద్దులో లేదా ఇతర ప్రదేశాలలో -  ఉగ్రవాదాన్ని సహించరాదని బిడెన్ అభిప్రాయపడ్డారు. ఇండో-పసిఫిక్ ప్రాంతానికి చైనాతో సహా ఏ దేశమూ తన పొరుగువారిని శిక్ష మినహాయింపు పేరిట బెదిరించలేని విధంగా నిబంధనల ఆధారిత మరియు స్థిరమైన మద్దతు ఇవ్వడానికి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ భారత్‌తో కలిసి పని చేస్తుంది.

మన ప్రజలందరినీ ఆందోళనకు గురిచేసే ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి పారిస్ క్లైమేట్ ఎగ్రిమెంట్ పై విజయవంతంగా సంతకం చేయడానికి ఒబామా-బిడెన్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంతో కలిసి పనిచేసింది.  బిడెన్ అడ్మినిస్ట్రేషన్ యునైటెడ్ స్టేట్స్ ను తిరిగి పారిస్ ఎగ్రిమెంట్ లోకి తీసుకువస్తుంది, వాతావరణ మార్పులపై పోరాడటానికి భారతదేశంతో కలిసి పనిచేయడానికి, మన కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు మన క్లీన్ ఎనర్జీ యొక్క భవిష్యత్తును భద్రపరచడానికి మరోసారి చేతులు కలిపే పని చేస్తుంది, అది లేనినాడు మనం మనకు అవసరమైన హరిత ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము.

 

 

భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ సహజ భాగస్వాములు అనే తన చిరకాల నమ్మకాన్ని బిడెన్ వెల్లడిస్తున్నారు మరియు యు.ఎస్-ఇండియా సంబంధాన్ని బలోపేతం చేయడానికి బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇండియా మరియు యునైటెడ్ స్టేట్స్ బాధ్యతాయుతమైన భాగస్వాములుగా పనిచేయకుండా ఏ విధమైన సాధారణ ప్రపంచ సవాలును పరిష్కరించలేవు. కలిసికట్టుగా, మనము ఉగ్రవాద నిరోధక భాగస్వామిగా భారతదేశం యొక్క రక్షణ మరియు సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడం, మహమ్మారిని ఎదుర్కొనడం మరియు ఉన్నత విద్య, అంతరిక్ష పరిశోధన మరియు మానవతాపరమైన ఉపశమనం కలిగించడం వంటి వాటిలో సహకారాన్ని మరింతగా పెంచుతాము.

ప్రపంచంలోని పురాతనమైన మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం -  స్వేచ్ఛాయుత ఎన్నికలు, చట్ట ప్రకారం సమానత్వం మరియు భావ ప్రకటన మరియు మతపరమైన స్వేచ్ఛ వంటి మనం పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయి: ఈ ప్రధాన సూత్రాలు మన దేశాలన్నింటి చరిత్రలోనూ ఉన్నాయి, అవి భవిష్యత్తులో మన బలానికి ఒక ఆధారంగా కొనసాగుతాయి.